: కొత్త పాలసీ... హైదరాబాద్ నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరు, పుణెలకు రూ. 2,500కే విమాన టికెట్


సరికొత్త విమానయాన పాలసీకి మోదీ క్యాబినెట్ ఆమోదం పలకడంతో, మధ్య తరగతికి సైతం విమానయానం దగ్గరయ్యే అవకాశం వచ్చినట్లయింది. విమానంలో గరిష్ఠంగా గంట ప్రయాణ సమయం పట్టే రెండు నగరాల మధ్య రూ. 2,500 కన్నా అధిక మొత్తంలో చార్జీలను వసూలు చేయరాదని కేంద్రం ఈ పాలసీలో పేర్కొంది. ఇక 30 నిమిషాల దూరంలో ఉన్న పట్టణాలు, నగరాల మధ్య రూ. 1,300 కన్నా టికెట్ ధర మించరాదు. దీంతో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, పుణె, విజయవాడ, నాగపూర్ తదితర ప్రాంతాలకు రూ. 2,500 తోనే ప్రయాణించే అవకాశం దక్కనుండగా, తిరుపతి నుంచి చెన్నై, కడప, విజయవాడ, విజయవాడ నుంచి కడప, రాజమండ్రి, విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి భువనేశ్వర్, కడప నుంచి బెంగళూరు వంటి ప్రాంతాలకు రూ. 1,300 టికెట్ తో ప్రయాణించవచ్చు.

  • Loading...

More Telugu News