: మొన్న ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది: సచివాలయ పనుల తీరుపై బాబు ఆగ్రహం
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలోని వెలగపూడి ప్రాంతంలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయం పనులు జరుగుతున్న తీరుపై చంద్రబాబు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పనులు మరింత వేగంగా జరగాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తాను ఇటీవల వచ్చినప్పుడు నిర్మాణం ఎలా ఉందో, ఇప్పుడూ అలాగే కనిపిస్తోందని అభిప్రాయపడ్డ ఆయన, ఉన్నతాధికారులు దగ్గరుండి పనులను వేగవంతం చేయాలని సూచించారు. విజయవాడ రియల్ ఎస్టేట్ సంఘం నుంచి పెద్దఎత్తున భవన నిర్మాణ కార్మికులు వచ్చినందున, వారందరినీ ఉపయోగించుకోవాలని చంద్రబాబు ఎల్అండ్ టీ అధికారులతో అన్నారు. మరో పది రోజుల్లో పూర్తి స్థాయిలో భవనాలు సిద్ధం కావాలని ఆదేశించారు.