: అధికారులపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోన్న అధికారులపై మండిపడ్డారు. అభివృద్ధి పనులపై నిర్లక్ష్యం వహించొద్దని, తీవ్ర పరిణామాలెదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. బెంగుళూరులో పర్యటించిన ఆయన అక్కడి వీధుల్లో పరిస్థితులను తెలుసుకొని అధికారులను హెచ్చరించారు. పారిశుద్ధ్య పనుల తీరుపై ఆయన అధికారులపై ఆసహనం వ్యక్తం చేశారు. మైసూరులో ఆయన పర్యటిస్తూ రహదారులను పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అక్కడి గాలి ఆంజనేయ స్వామి ఆలయంలోకి వర్షపునీటిని రానివ్వకుండా రూ.5కోట్లతో చేపట్టిన పనులపై ఆయన ఆరా తీశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో వెంట వెంటనే పర్యటనలు చేస్తూ నెమ్మదిగా కొనసాగుతోన్న పలు పనులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హెణ్ణూరు జంక్షన్లో చేపట్టిన ఫ్లైఓవర్ నిర్మాణ పనులు తొందరగా ముగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. అక్కడ భూ స్వాధీన ప్రక్రియపై సిద్ధరామయ్య ఆరా తీశారు. సీఎం నగర పర్యటనతో రోడ్లపై పలు వాహనాలను తరుచూ నిలిపేస్తుండడంతో వాహనదారులు ఇక్కట్లు పడ్డారు.