: స్విమ్ సూట్లో నల్ల కలువ!... బీచ్ లో నెమార్ తో కలిసి పోజిచ్చిన సెరెనా!
క్రీడా ప్రపంచం ‘నల్ల కలువ’గా ముచ్చటగా పిలుచుకునే అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ స్విమ్ సూట్ లో దర్శనమిచ్చింది. గతంలోనూ పలుమార్లు ఆమె సింగిల్ పీస్ స్విమ్ సూట్లో దర్శనమిచ్చినా... తాజాగా బ్రెజిల్ ఫుట్ బాల్ సూపర్ స్టార్ నెమార్ జూనియర్ తో కలిసి ఆమె ఈత దుస్తుల్లో దర్శనమివ్వడం క్రీడా ప్రపంచంలో ఆసక్తి రేకెత్తించింది. అమెరికాలోని లాస్ వెగాస్ బీచ్ క్లబ్ లో సెరెనా, నెమార్ లిద్దరూ కలిసి ఫొటోలకు పోజిచ్చారు. వీకెండ్ బీచ్ పార్టీలో భాగంగా వీరిద్దరూ అక్కడ కలిసి కనిపించడంపై పెద్ద ఎత్తున రూమర్లు వెల్లువెత్తుతున్నాయి.