: ‘ముస్లిం ముక్త్ భారత్’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు.. సాధ్వీ ప్రాచీపై కేసు నమోదు
వివాదాస్పద వ్యాఖ్యలతో తరుచూ వార్తల్లో నిలిచే విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వీ ప్రాచీ కొన్ని రోజుల క్రితం ‘ముస్లిం ముక్త్ భారత్’కు సమయం వచ్చేసిందంటూ మరో వివాదాస్పద వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై కేసు నమోదయింది. మోదీ దేశ ప్రజలకిచ్చిన పిలుపు ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ సక్సెసవుతోందని, ఇక ‘ముస్లిం ముక్త్ భారత్’కు సిద్ధం కావాలని ఆమె చేసిన వ్యాఖ్యలు ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూ బహుజన్ ముక్తి మోర్చ కార్యకర్త సందీప్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సెక్షన్ 153 ఏ, ఐపీసీ 153బీ కింద కేసు నమోదు చేశారు.