: ఎయిమ్స్ ఫలితాల్లో ఫస్ట్ ర్యాంకర్ మనోడే!... సత్తా చాటిన సాత్విక్ రెడ్డి


దేశంలోనే వైద్య విద్యలో ప్రతిష్ఠాత్మక విద్యాలయంగా పేరుగాంచిన అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ల్లో ఎంబీబీఎస్ ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగు తేజం మెరిసింది. తిరుపతికి చెందిన సాత్విక్ రెడ్డి అనే విద్యార్థి (హాల్ టికెట్ నెంబరు:183118) ఆల్ ఇండియా స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. దేశ రాజధాని ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మరో ఆరు ఎయిమ్స్ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం గత నెల 29న ఆలిండియా స్థాయి ప్రవేశ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాల్లో సాత్విక్ రెడ్డి ఫస్ట్ ర్యాంక్ కైవసం చేసుకున్నాడు. ఇక ఏపీ సర్కారు నిర్వహించిన ఎంసెట్ లో రెండో ర్యాంకు సాధించిన సాత్విక్ రెడ్డి, తెలంగాణ సర్కారు నిర్వహించిన అగ్రికల్చర్ పరీక్షలో 15వ ర్యాంకును సాధించాడు. ఎయిమ్స్ ఫలితాల నేపథ్యంలో తాను ఢిల్లీలోని ఎయిమ్స్ లోనే వైద్యవిద్యనభ్యసిస్తానని అతడు చెప్పాడు.

  • Loading...

More Telugu News