: ప్లేస్ మార్చిన కాపు నేతలు!... 17న బెజవాడలో చిరు, బొత్స, దాసరిల కీలక భేటీ!


కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్న కాపు సామాజిక వర్గ నేతలు చిరంజీవి, బొత్స సత్యనారాయణ, దాసరి నారాయణరావులు ఏపీ ప్రభుత్వానికి నిర్దేశించిన గడువు నేటితో ముగిసింది. అయితే ముద్రగడ దీక్షను విరమింపజేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సఫలం కాలేదు. ఆసుపత్రికి తరలించినా.. దీక్షను విరమించని ముగ్రదడ వరుసగా ఏడో రోజు కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సర్కారుకు రెండు రోజుల డెడ్ లైన్ విధించేందుకు మొన్న హైదరాబాదులో భేటీ అయిన చిరు, బొత్స, దాసరిలు తాజాగా తమ భేటీ ప్లేస్ ను మార్చేశారు. హైదరాబాదు నుంచి విజయవాడ భేటీ స్థలాన్ని మార్చిన వీరు ఈ నెల 17న భేటీ కానున్నారు. తాము నిర్దేశించిన గడువు ముగిసినా... ముద్రగడ దీక్షను విరమించే దిశగా సరైన చర్యలు చేపట్టలేదని ప్రభుత్వంపై వారు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ముద్రగడ దీక్షకు సంఘీభావంగా, ప్రభుత్వ దమన నీతికి వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించేందుకు వారు బెజవాడలో భేటీ అవుతున్నట్లు సమాచారం. దీంతో ఈ భేటీపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

  • Loading...

More Telugu News