: టాస్ వరించకున్నా టీమిండియాకు ఛేజింగే!


జింబాబ్వే టూర్ లో కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి అన్నీ అనుకూలంగానే పరిణమిస్తున్నాయి. మొత్తం మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో వరుసగా తొలి రెండు వన్డేల్లో సత్తా చాటిన ధోనీ సేన ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది. తాజాగా మరికాసేపట్లో ఆతిథ్య జట్టుతో టీమిండియా మూడో వన్డే ఆడనుంది. తొలి రెండు వన్డేల్లో టాస్ టీమిండియా వైపే మొగ్గు చూపగా.. ఛేజింగ్ కే ధోనీ సై అన్నాడు. ఇక కొత్త కుర్రాళ్లు కూడా సత్తా చాటడంతో ఈజీగానే జింబాబ్వేపై ధోనీ విజయం సాధించాడు. ఇక నేటి వన్డేలో భాగంగా టాస్ ఆతిథ్య దేశ జట్టు వైపు మొగ్గింది. అయితే టాస్ ఓడినా ధోనీకి మాత్రం ఛేజింగే దక్కింది. టాస్ గెలిచిన జింబాబ్వే కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుని... పర్యాటక జట్టుకు బౌలింగ్ అప్పగించాడు.

  • Loading...

More Telugu News