: ఇంకా ఎన్నో కంపెనీలు హైద‌రాబాద్‌కి రాబోతున్నాయి: కేటీఆర్


ఐటీ రంగంలో మంచి వృద్ధి రేటు సాధించామ‌ని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు ఆయ‌న‌ తెలంగాణ ఐటీ శాఖ రెండో వార్షిక నివేదికను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌తిష్ఠాత్మ‌క ప్ర‌పంచ ఐటీ కంపెనీల‌న్నీ హైద‌రాబాద్‌కు వ‌చ్చాయ‌ని అన్నారు. ఇంకా ఎన్నో కంపెనీలు హైద‌రాబాద్‌కి రాబోతున్నాయని తెలిపారు. టీ హ‌బ్ ఇండియాకే ఆద‌ర్శమ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. గ‌త‌ ఏడాది ఐటీ ఎగుమ‌తులు రూ.67 వేల కోట్లుగా ఉంద‌ని, ఈ ఏడాది ఐటీ ఎగుమ‌తులు రూ.75వేల కోట్లు సాధించామని ఆయ‌న పేర్కొన్నారు. వ‌చ్చే ఐదేళ్ల‌లో ఐటీ ఎగుమ‌తుల్ని రెట్టింపు చేస్తామ‌ని అన్నారు.

  • Loading...

More Telugu News