: హైదరాబాద్‌లో ఫీ‘జులుం’.. ఫీజు కట్టలేదని 27మంది స్కూలు విద్యార్థులకు టీసీలిచ్చిన వైనం
హైదరాబాద్ మహింద్రాహిల్స్‌లోని అమృత స్కూల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్కూలు ఫీజు కట్టలేదంటూ స్కూల్ యాజమాన్యం 27మంది విద్యార్థులకు టీసీలిచ్చింది. స్కూలు ఫీ‘జులుం’ని ప్రదర్శిస్తోందంటూ అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో 27మంది పిల్లలకు స్కూలు టీసీలు ఇచ్చిందని అక్కడకు చేరుకున్న విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. తమ పిల్లలకు టీసీలు ఇవ్వడంతో స్కూల్ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. ‘పెంచిన ఫీజులపై ఫిర్యాదు చేసినందుకు టీసీలు ఇస్తారా..?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్ పేరెంట్స్ అసోసియేషన్, విద్యార్థి సంఘాలు పాల్గొన్నాయి.