: ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తోంది.. అత్యవసర వైద్యం అందించేందుకు సిద్ధం: మంత్రి కామినేని
కాపు రిజర్వేషన్లే లక్ష్యంగా తునిలో నిర్వహించిన సభలో విధ్వంసం సృష్టించారంటూ ప్రభుత్వం పలువురిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కొనసాగిస్తోన్న ఆమరణ నిరాహార దీక్షపై ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. ముద్రగడ, ఆయన కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణిస్తోందని కామినేని మీడియాకు తెలిపారు. అత్యవసర వైద్యం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. వైద్య పరీక్షల కోసం కాకినాడ నుంచి అదనపు వైద్య నిపుణులను తీసుకొచ్చామని ఆయన తెలిపారు. అయితే, ముద్రగడ వైద్యాన్ని నిరాకరిస్తున్నారని ఆయన అన్నారు.