: ముద్రగడతో మరో దఫా చర్చలకు ప్రభుత్వ బృందాన్ని పంపిస్తాం: చినరాజప్ప
ముద్రగడ ఆరోగ్యాన్ని కాపాడడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి చినరాజప్ప అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చినరాజప్ప ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా చినరాజప్ప ముద్రగడ కొనసాగిస్తోన్న దీక్షపై స్పందిస్తూ.. ముద్రగడ ఆరోగ్యాన్ని కాపాడడానికి తాము సీనియర్ వైద్యుల బృందాన్ని అందుబాటులో ఉంచామని మీడియాకు తెలిపారు. ముద్రగడతో మరో దఫా చర్చలకు ప్రభుత్వ బృందాన్ని పంపిస్తామని ఆయన చెప్పారు. కేసుల విషయంలో ప్రభుత్వం చట్టానికి లోబడే పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ముద్రగడ షరతులను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.