: చిరంజీవి, దాసరి అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు..?: ప్రత్తిపాటి
తునిఘటనలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాపు ఐక్య వేదిక నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఏడో రోజు కొనసాగుతోంది. ముద్రగడ వైద్యానికి నిరాకరిస్తున్నారు. ముద్రగడ దీక్షపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. ఈరోజు గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ వైద్యాన్ని నిరాకరిస్తున్నారని తెలిపారు. ముద్రగడ ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ‘ముద్రగడ దీక్ష విషయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోన్న కేంద్ర మాజీ మంత్రులు దాసరి నారాయణరావు, చిరంజీవి తాము అధికారంలో ఉన్నప్పుడు కాపులకు ఏం చేశారు..?’ అని ఆయన ప్రశ్నించారు.