: జగన్ సినిమా సెటైర్లపై దేవినేని పవర్ పంచ్!... చివరి రీల్లోనూ చంద్రబాబే హీరో అంటున్న ఏపీ మంత్రి!
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎంపై సంధించిన సెటైర్లపై... కొద్దిసేపటి క్రితం టీడీపీ సీనియర్ నేత, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పవర్ పంచ్ లు విసిరారు. నేటి ఉదయం విజయవాడలో మీడియాతో మాట్లాడిన దేవినేని... నిన్న బెజవాడలో జరిగిన వైసీపీ భేటీపై నిప్పులు చెరిగారు. సినిమా కథ చెప్పిన జగన్... రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా జగన్ సినిమా సెటైర్లను ప్రస్తావించిన దేవినేని... తొలి రీల్లోనే జైలుకెళ్లిన జగన్ విలన్ గా మారిపోయారన్నారు. చివరి రీల్లోనూ చంద్రబాబే హీరో అని ఆయన వ్యాఖ్యానించారు. రాజకీయ చదరంగంలో జగన్ అతినీతి తిమింగలమే అని కూడా దేవినేని అన్నారు. నిన్నటి భేటీలో వైసీపీ చేసిన తీర్మానాలు చూస్తే ఆ పార్టీ డొల్లతనం బయటడిపోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పేరెత్తడానికే జగన్ భయపడుతున్నారని దేవినేని ఎద్దేవా చేశారు.