: ఏపీకి సేవ... నా అదృష్టం!: చంద్రబాబుకు లేఖలో సురేశ్ ప్రభు కామెంట్


కేంద్రంలో కీలకమైన రైల్వే శాఖకు మంత్రిగా ఉన్న సురేశ్ ప్రభును మొన్నటి రాజ్యసభ ఎన్నికలలో అధికార టీడీపీ తన కోటా నుంచి గెలిపించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న ఆయన ఢిల్లీ నుంచి చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. ఏపీకి సేవ చేయడం తన అదృష్టమని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. ‘‘రైల్వే మంత్రిగా ఉన్న నాకు రాజ్యసభ సభ్యుడిగా ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య, టీడీపీ, బీజేపీ ఏపీ శాఖలు, ఏపీ ప్రజలకు కృతజ్ఞతలు. నాపై ప్రగాఢ విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు. ఏపీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి వ్యాపారాలు, పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేస్తాను. ఏపీ అభివృద్ధి బాటలో పయనించేందుకు సహాయ సహకారాలు అందిస్తా’’ అని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News