: మరోమారు వెలగపూడికి చంద్రబాబు... తాత్కాలిక సచివాలయ పనుల పరిశీలన


నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ఏపీ ఉద్యోగుల తరలింపు ఇప్పటికే ప్రారంభమైపోయింది. ఏపీ మార్కెటింగ్ శాఖ సిబ్బంది ఇప్పటికే అక్కడికి తరలివెళ్లారు. ఈ క్రమంలో అక్కడ శరవేగంగా నిర్మాణం జరుగుతున్న తాత్కాలిక సచివాలయ పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. ఈ పనులను ఇప్పటికే పలుమార్లు పరిశీలించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేడు మరోమారు అక్కడికి వెళ్లనున్నారు. ఉద్యోగుల తరలింపు ప్రారంభమైన నేపథ్యంలో అక్కడ అందుబాటులో ఉన్న వసతులు, ఏర్పాటు కావాల్సిన సౌకర్యాలపై ఆయన దృష్టి సారించనున్నారు. నిర్మాణ పనులను పరిశీలించిన తర్వాత చంద్రబాబు అక్కడే పలు కీలక శాఖల అధికారులు, నిర్మాణ కంపెనీల ప్రతినిధులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News