: చంద్రబాబుకు సరైన మొగుడు జగనే!: లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్య


విజయవాడ కేంద్రంగా నిన్న జరిగిన కీలక సమావేశంలో వైసీపీ నేతలు... అధికార టీడీపీ, సీఎం నారా చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలోని టీవీ ఛానెల్ ప్రసారాల నిలిపివేతపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మైకందుకున్న టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘చంద్రబాబుతో పోరాడటం నా వల్ల కాలేదు. చంద్రబాబుకు సరైన మొగుడు జగనే’’ అని ఆమె వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News