: అమర్ నాథ్ యాత్రకు పొంచి ఉన్న ‘ఉగ్ర’ ముప్పు!... భద్రత కల్పిస్తామన్న హోం శాఖ!


అమర్ నాథ్ యాత్రకు బయలుదేరే హిందువులను టార్గెట్ చేస్తూ తాము దాడులకు పాల్పడబోమని ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించినప్పటికీ ఈ యాత్రకు ‘ఉగ్ర’ ముప్పు లేకపోలేదని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) కు చెందిన ఓ సీనియర్ అధికారి... అమర్ నాథ్ యాత్రకు వెళ్లే భక్తులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు విరుచుకుపడేందుకు ప్రణాళికలు రచించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. ఈ నేపథ్యంలో యాత్రకు భారీ భద్రతను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని, భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని హోం శాఖ ప్రతినిధి చెప్పారు. యాత్ర మార్గం వెంట సరిపడినంత మంది పారా మిలిటరీ బలగాలను రంగంలోకి దించుతున్నామని సదరు ప్రతినిధి చెప్పారు.

  • Loading...

More Telugu News