: ఎన్డీయే నకిలీ వికాస్ పర్వ్ చేసుకుంటోంది: నితీష్ కుమార్


ఎన్డీయే ప్రభుత్వం రెండేళ్లు విజయవంతంగా పాలన సాగించడంతో చేపట్టిన వికాస్‌ పర్వ్‌ నకిలీదని బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నిజమైన వికాస్ పర్వ్ సంబరాలు నిర్వహించాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మద్యపాన నిషేధం అమలు చేయాలని సూచించారు. గత ఎన్నికల సందర్భంగా బీహార్ లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తానని హామీ ఇచ్చానని, ఇచ్చిన మాట ప్రకారం నిషేధం విధించానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య కూడా నెమ్మదిగా తగ్గుముఖం పడుతోందని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News