: రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారు: జైరాం రమేష్
ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతల్ని త్వరలోనే రాహుల్ గాంధీ స్వీకరిస్తారని కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, పార్టీ కోసం అంకితభావం, నిబద్ధతతో పని చేసేవారే రాహుల్ గాంధీ టీంలో ఉంటారని అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ తిరిగి అధికారం చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 1998లో ఏఐసీసీ చీఫ్ గా సోనియా బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీ ఇంత కంటే ఇబ్బందుల్లో ఉందని ఆయన తెలిపారు. మన్మోహన్ సింగ్ ఆర్ధిక విధానాలనే మోదీ అనుసరిస్తూ, వాటిని తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.