: కాకి వాలిందని కారు మార్చలేదు!: క‌ర్ణాట‌క సీఎం వివరణ


క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్ధరామయ్య కారుపై ఇటీవల ఓ కాకి వాలడం, దానిని అపశకునంగా భావించి ఆ వెంటనే ఆయన కారుని మార్చేసి కొత్త కారు తీసుకున్నారంటూ ప్రచారం జరగడం తెలిసిందే. అయితే తాను త‌న‌ కారును మార్చింది త‌న పాత కారుపై కాకి వాలినందుకు కాద‌ని ఆయ‌న మీడియాకు వివరణ ఇచ్చారు. కారుపై కాకి వాలడాన్ని అరిష్టంగా భావించి కారును మార్చినట్లు త‌నపై వ‌స్తోన్న వార్తలు వాస్త‌వం కాదని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాన‌స‌లు అటువంటివి న‌మ్మ‌బోన‌ని సిద్ధరామయ్య మీడియాతో చెప్పారు. త‌న కారు పాత‌బ‌డినందుకు మాత్ర‌మే కొత్త కారుకు ఆర్డ‌రిచ్చిన‌ట్లు ఆయ‌న తెలిపారు.

  • Loading...

More Telugu News