: క్లీన్ స్వీప్ పై ధోనీ గురి...రిజర్వ్ బెంచ్ కు అవకాశం


టీమిండియా కెప్టెన్ ధోనీ క్లీన్ స్వీప్ పై కన్నేశాడు. జింబాబ్వే టూర్ లో ద్వితీయ శ్రేణి జట్టుతో బౌలర్లు, ఓపెనర్ల ప్రతిభతో వరుస వన్డేల్లో విజయం సాధించి టోర్నీ గెలుచుకున్న ధోనీ, చివరి వన్డేను కూడా గెలుచుకుని క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తున్నాడు. ఈ క్రమంలో రిజర్వ్ బెంచ్ ను కూడా పరీక్షించాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇఫ్పటికే కొత్త వారికి అవకాశం ఇస్తానని ధోనీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే రెండు వన్డేల్లో సత్తా చాటిన రాహుల్, రాయుడులు ఇప్పుడు రిజర్వ్ బెంచ్ కు పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వారి స్థానంలో ఫయాజ్ ఫజల్, మన్ దీప్ సింగ్ లకు అవకాశం లభించవచ్చు.

  • Loading...

More Telugu News