: కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అరకొర వసతులపై హైకోర్టు సీరియస్
కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో అరకొర వసతులపై హైకోర్టు స్పందించింది. ఇటీవల ఆసుపత్రిలోని వసతులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏ పని జరగాలన్నా అక్కడి సిబ్బంది చేయి చాపుతున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి. ఆసుపత్రి దుస్థితిపై విచారణ చేపట్టిన హైకోర్టు అక్కడి వసతులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్కడి పరిస్థితులు, వసతులను పరీశీలించడానికి జయంతి, పద్మ అనే ఇద్దరు మహిళా న్యాయవాదులతో కమిటీని నియమించింది. అక్కడి పరిస్థితులపై మూడు వారాల్లోగా నివేదిక అందించాలని కమిటీకి కోర్టు సూచించింది.