: ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు చెప్పని అబద్ధం అంటూ లేదు: జగన్
‘ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ సమస్య వచ్చినా వైసీపీ అందుబాటులో వుంటుంది’ అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘అమ్మ, నేను కలసి మొదలు పెట్టిన పార్టీ అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఇంతమంది ప్రజానీకం ఆదరణ పొందుతోంద’ని ఆయన అన్నారు. ‘మొన్న ఎన్నికల్లో చంద్రబాబుకి కోటి ముప్పై ఐదు లక్షల ఓట్లు వస్తే, మనకి కోటి ముప్పై లక్షల ఓట్లు వచ్చాయి.. కేవలం ఐదు లక్షల ఓట్లే తేడా’ అని జగన్ అన్నారు. చంద్రబాబు ఎన్నికల్లో గెలవడానికి చెప్పని అబద్ధం అంటూ లేదని జగన్ అన్నారు. ఎన్నికల సమయంలో ఎక్కడ ఖాళీగా గోడలు కనపడినా ఆయన వాటిపై ప్రచారం చేసుకున్నారని అన్నారు. ‘ఏ ప్రసంగం చేసినా రుణమాఫీ చేస్తాను అని మాట్లాడారు. డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ అన్న అంశాన్నే చంద్రబాబు మర్చిపోయార’ని ఆయన విమర్శించారు.