: హిందూసేన ఆధ్వర్యంలో ఢిల్లీలో ఘనంగా ట్రంప్ పుట్టిన రోజు వేడుకలు
రిపబ్లికన్ల తరఫున అమెరికన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో పోటీ చేయనున్న డొనాల్డ్ ట్రంప్ బర్త్ డే వేడుకలను మనదేశ రాజధాని న్యూఢిల్లీలో 'హిందూ సేన' వైభవంగా జరిపింది. ఇక్కడి జంతర్ మంతర్ వద్ద హిందూసేన కార్యకర్తలు ట్రంప్ ప్లెక్సీ ముందు భారీ కేక్ ను ఏర్పాటు చేసి, దాన్ని కట్ చేసి వేడుక చేసుకున్నారు. 'హ్యాపీ బర్త్ డే ట్రంప్', 'లాంగ్ లివ్ ట్రంప్' అంటూ నినాదాలు చేశారు. అంతకుముందు ఓర్లాండో లోని పల్స్ గే క్లబ్ లో జరిగిన మారణకాండలో బలైన వారి ఆత్మలకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ట్రంప్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా హిందూసేన బెలూన్లు, తోరణాలతో ఆ ప్రాంతాన్ని అలంకరించడంతో అక్కడ సందడి నెలకొంది. పలువురు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా తిలకించడం కనిపించింది.