: తదుపరి రాష్ట్రపతిగా మురళీ మనోహర్ జోషి?... బీజేపీ వర్గాలలో చర్చ!
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం మరో ఏడాదిపాటు మాత్రమే ఉండడంతో, ఆయన తరువాతి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? అంటూ బీజేపీలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పదవికి పలువురు బీజేపీ సీనియర్ నేతలు పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆ జాబితాలో కాన్పూర్ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి పేరు కూడా వినిపిస్తోంది. రాష్ట్రపతి పదవి కోసం ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సీనియర్లతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రపతి పదవికి పోటీ పడడంపై వారితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై మోదీ, అమిత్ షాలు తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా, మురళీ మనోహర్ జోషీకి ఆర్‌ఎస్‌ఎస్ నేత దేవేంద్ర స్వరూప్ మద్దతు పలుకుతున్నారని సమాచారం. కాగా, గతంలో రాష్ట్రపతి పదవిని ఎల్ కే అద్వానీకి ఇవ్వనున్నట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు జోషి పేరు తెరపైకి రావడంతో రాజకీయ వర్గాలలో ఆసక్తి నెలకొంది.