: ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం...పరుగులు తీసిన ప్రజలు
ప్రకాశం జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. పామూరు, సీఎస్ పురం మండలాల్లో ఈ భూకంపం సంభవించింది. రెండు సెకెన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఉలిక్కిపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇళ్లలో సామాన్లు కిందపడడం మినహా పెద్ద ఘటనలు ఏమీ చోటుచేసుకోకపోవడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ మధ్య కాలంలో వరుసగా భూమి కంపించడంపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.