: దొంగలు, దోపిడీదారులు పార్టీని వీడారు.. ఆవేదన వద్దు: జానారెడ్డికి వీహెచ్ ఓదార్పు
కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతూ అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవుతున్నట్లు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్టీ నేతలు వివేక్, వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠ కోసం సీఎల్పీ పదవిని వదులుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఈరోజు ప్రకటించడం పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. దొంగలు, దోపిడీ దారులు పార్టీని వీడారని, వారి గురించి ఆవేదన పడవద్దని ఆయన హితవు పలికారు. ఆపదలో ఉన్న కాంగ్రెస్‌ని జానారెడ్డి నిలబెట్టాలని ఆయన కోరారు. జానా తప్పుకుంటే క్యాడర్‌లో స్థైర్యం దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడుతూ... తెలంగాణను రాష్ట్రప్రభుత్వం తాగుబోతుల రాజ్యంగా మార్చిందని అన్నారు.