: ఈ నెల 26న తెలంగాణలో అధికారిక ఇఫ్తార్ విందులు


ముస్లింల పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారిక ఇఫ్తార్ విందులు ఈ నెల 26న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిజాం కాలేజీ గ్రౌండ్ లో జరగనున్న ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల ముస్లిం నిరుపేదల కుటుంబాలకు దుస్తులు పంపిణీ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ నెల 17 నుంచి 22 వరకు హైదరాబాదులో వీటిని పంపిణీ చేస్తారు. అలాగే ముస్లింలు నిర్వహించుకునే ఇఫ్తార్ విందు కోసం అధికారులు సరైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

  • Loading...

More Telugu News