: కేసీఆర్ రాజకీయ వ్యాపారం చేస్తున్నారు: మల్లు రవి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యాపారం చేస్తున్నారని కాంగ్రెస్ నేత మల్లు రవి విమర్శించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గుత్తా సుఖేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరడం సోనియా గాంధీని, నల్గొండ జిల్లా ప్రజలను వెన్నుపోటు పొడవడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మాజీ ఎంపీ వివేక్ తన సోదరుడు వినోద్ తో కలిసి టీఆర్ఎస్ లో చేరడంతో కాకా ఆత్మ క్షోభిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ముఖ్యమంత్రి అనైతిక రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ విధానం రాజకీయాలను భ్రష్టుపట్టిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News