: చర్చలు సఫలం.. తెలంగాణ విద్యుత్ కార్మికుల సమ్మె విరమణ
తెలంగాణ విద్యుత్ కార్మిక సంఘాలతో మంత్రి జగదీశ్ రెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సుదీర్ఘంగా మంత్రితో చర్చించిన అనంతరం తెలంగాణ విద్యుత్ కార్మికులు తాము రేపటి నుంచి చేయాలనుకుంటోన్న సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు తెలిపారు. 1100 మంది లైన్‌మెన్లను క్రమబద్ధీకరిస్తామని పేర్కొన్నారు.