: పంజాబీ పాటకు స్టెప్పులేసిన జాకీ చాన్
ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ హీరో జాకీ చాన్ బాలీవుడ్ పాటకు స్టెప్పులేశాడు. ఈ మధ్యే 'కుంగ్ పూ యోగా' సినిమాలో నటిస్తున్న జాకీ చాన్ భారత్ లో షూటింగ్ సందర్భంగా ఓ పాటకు ప్రముఖ బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్ నృత్యదర్శకత్వంలో డాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అనుభవాన్ని జాకీ చాన్ ఇప్పుడు చైనాలో ప్రదర్శించాడు. చైనాలో జరిగిన 17వ షాంఘై ఫెస్టివల్ కు జాకీచాన్, సోనూ సూద్ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ బాలీవుడ్ పాటకు సోనూ సూద్ ను డాన్స్ చేయమని కోరగా, సోనూ జాకీ సహాయం తీసుకున్నాడు. దీంతో వీరిద్దరూ కలిసి 1990ల్లో విడుదలైన 'టుక్ టుక్ టున్' అంటూ సాగే పంజాబీ గీతానికి డాన్స్ చేశాడు. దీంతో జాకీ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ వీడియోను సోనూ సూద్ ట్విట్టర్ లో పోస్టు చేయగా, అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.