: గుత్తా సుఖేందర్ రెడ్డి పార్టీని వీడడంతో కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని పోయింది: కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి


టీఆర్ఎస్‌లోకి జంప్ చేస్తోన్న త‌మ‌ పార్టీ నేత‌లు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, పార్టీ నేతలు వివేక్, వినోద్, ఎమ్మెల్యే భాస్కరరావుపై కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిప‌డ్డారు. ఈరోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మాట్లాడుతూ.. ‘నల్గొండ లోక్‌సభ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి టీఆర్ఎస్ లోకి వెళ్లిపోనుండడంతో కాంగ్రెస్ పార్టీకి పట్టిన శని పోయింది’ అని ఆయ‌న అన్నారు. గుత్తా, భాస్క‌ర్ రావు పార్టీ కండువా మారుస్తోన్న సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు స‌హేతుక‌మైన‌వి కావని ఆయ‌న వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు నిన్న స‌ద‌రు నేత‌లు ప్ర‌క‌టించ‌డంతో వారు పార్టీని వీడుతున్నందుకు త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని కోమటిరెడ్డి అన్నారు. పార్టీని వీడనున్న నేత‌లు రాజీనామా చేసి మ‌ళ్లీ గెలిస్తే తాను రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకుంటాన‌ని కోమ‌టిరెడ్డి ప్ర‌క‌టించారు.

  • Loading...

More Telugu News