: వైసీపీ భేటీకి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే డుమ్మా!... ఈటీవీ ‘వన భారతి’లో ఉత్సాహంగా పాల్గొన్న రాచమల్లు!
నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నేటి ఉదయం ప్రారంభమైంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, పార్లమెంటు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, జడ్పీటీసీలు, ఎంపీపీలంతా హాజరైన ఈ భేటీకి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరయ్యారు. వెరసి పార్టీ మొత్తం బెజవాడకు చేరిపోయింది. అయితే జగన్ సొంత జిల్లాలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ ముఖ్య నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాత్రం బెజవాడ వెళ్లలేదు. ఏపీలో తొలిసారిగా జరుగుతున్న ఈ భేటీకి డుమ్మా కొట్టిన రాచమల్లు తెలుగు న్యూస్ ఛానెట్ ‘ఈటీవీ‘ చేపట్టిన ‘వన భారతి- జన హారతి’ కార్యక్రమంలో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ప్రొద్దుటూరు శివారు దొరసానిపల్లి సాయిబాబా గుడి వద్ద సదరు ఛానెల్ చేపట్టిన కార్యక్రమంలో రాచమల్లు మొక్కలు నాటారు.