: గుత్తా సుఖేందర్ రెడ్డి పెద్ద జోకేశారు: కోమటిరెడ్డి

కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్నాయని, ఆధిపత్య పోరు జరుగుతోందని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించడం ఈ సంవత్సరపు అతిపెద్ద జోక్ అని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎద్దేవా చేశారు. అన్నం పెట్టిన పార్టీని వదలాలని నిర్ణయించుకున్న గుత్తా, భాస్కర్ రావులు ఏ మాత్రం నైతికత ఉన్నా, తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ వాళ్లు రాజీనామా చేసి, తిరిగి ఎన్నికల్లో గెలిస్తే, తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. సిగ్గూ శరం విడిచి పార్టీ మారిన వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు తొందర్లోనే రానుందని కోమటిరెడ్డి అన్నారు.