: కాపు నేతలతో చర్చించేదేమీ లేదన్న గంటా!
ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష, కాపుల సంక్షేమం, వారికి రిజర్వేషన్లు తదితర అంశాలపై మంత్రి గంటా శ్రీనివాసరావుతో చర్చించేందుకు వెళ్లిన విశాఖపట్నం జిల్లా కాపు సంఘాల నేతలకు నిరాశే మిగిలింది. కొద్దిసేపు చర్చించే సమయం ఇవ్వాలని పలువురు నేతలు, ఈ ఉదయం గంటా క్యాంప్ ఆఫీసుకు వెళ్లారు. ప్రస్తుత పరిస్థితుల్లో తానేమీ చర్చించేది లేదంటూ సమాధానం చెప్పిన గంటా, చర్చలకు నిరాకరించి వాహనం ఎక్కి వెళ్లిపోయారు. మంత్రి వైఖరితో విస్తుపోయిన కాపు సంఘాల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి హోదా ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించిన జిల్లా కాపునాడు అధ్యక్షుడు తోట రాజీవ్, పదవి కోసం మీటింగులు పెట్టి కాపులను వాడుకున్న రోజులను మరిచావా? అని దుయ్యబట్టారు.