: ఢిల్లీ రవాణా శాఖ మంత్రి రాజీనామా!... సత్యేంద్ర జైన్ కు బాధ్యతలు అప్పగించిన కేజ్రీ!


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేబినేట్ లో రవాణా శాఖ మంత్రిగా ఉన్న గోపాల్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం తన రాజీనామా లేఖను సీఎం కేజ్రీవాల్ కు అందజేశారు. అనారోగ్య కారణాలతోనే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాయ్ ప్రకటించారు. గోపాల్ రాయ్ నిష్క్రమణతో రవాణా శాఖ బాధ్యతలను తన పార్టీ ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్ కు అప్పగిస్తూ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గోపాల్ రాయ్ రాజీనామా, వెనువెంటనే సత్యేంద్ర జైన్ కు బాధ్యతల అప్పగింత వెనుక అసలు కారణాలేమిటన్నది తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News