: 'కోరిక' తీర్చని భర్తను హత్యచేసిన భార్యకు యావజ్జీవ ఖైదు


లైంగిక వాంఛను తీర్చేందుకు అంగీకరించని భర్తను దారుణంగా హత్య చేసిన మహిళకు అహ్మదాబాద్ సిటీ సెషన్స్ కోర్టు యావజ్జీవ ఖైదు, రూ. 2 వేల జరిమానాను విధించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, శారదానగర్ ప్రాంతంలో నర్సింహ, విమల దంపతులు నివాసం ఉంటున్నారు. నవంబర్ 2, 2013న నర్సింహను, విమల హత్య చేసింది. తనతో కాకుండా మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్నాడని, అందుకే తన కోరిక తీర్చడం లేదన్న కోపంతో ఆమె ఓ కర్రతో భర్త మరణించేంత వరకూ కొట్టింది. ఆపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన భర్తను ఎవరో హత్య చేశారని ఫిర్యాదు చేసింది. తర్వాత విచారణలో ఆమె హంతకురాలని తేలడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి, చార్జ్ షీట్ దాఖలు చేశారు. కేసు విచారణ దాదాపు రెండున్నరేళ్లు సాగగా, న్యాయస్థానం ఆమెకు యావజ్జీవ ఖైదును విధిస్తూ తీర్పిచ్చింది. రూ. 2 వేల జరిమానాను చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల జైలు శిక్షను అనుభవించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

  • Loading...

More Telugu News