: ఓర్లాండోలో కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్న ఒబామా
స్వలింగ సంపర్కం పట్ల వ్యతిరేకతతో ఒమర్ మతీన్ అనే వ్యక్తి అమెరికా ఫ్లోరిడాలో ఓర్లాండోలోని పల్స్ 'గే' నైట్ క్లబ్ లో కాల్పులు జరిపి 50 మందిని బలిగొన్న విషయం తెలిసిందే. కాల్పుల్లో మరో 53 మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎల్లుండి ఓర్లాండో నైట్‌క్లబ్‌లో దాడి జరిగిన ప్రాంతానికి వెళ్లనున్నట్లు వైట్ హౌస్ ప్రకటించింది. క్లబ్లో జరిగిన దాడితో తమ దేశాధ్యక్షుడు తన పలు పర్యటనల్ని వాయిదా వేసుకున్నట్లు పేర్కొంది. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని సందర్శించి, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను, క్షతగాత్రులను ఒబామా పరామర్శించనున్నారు.