: రింగింగ్ ‘బెల్స్’ మోగాయి!... ఈ నెల 28 నుంచి ఫ్రీడం 251 ఫోన్ల డెలివరీ!


కేవలం రూ.251కే స్మార్ట్ ఫోన్ ను అందజేస్తానని ప్రపంచ మొబైల్ దిగ్గజాలకు కంటిమీద కునుకు లేకుండా చేయడంతో పాటు ప్రజల దృష్టిని తన వైపు తిప్పేసుకుని సంచలనం రేపిన ‘రింగింగ్ బెల్స్’ మరోమారు ఎంట్రీ ఇచ్చింది. రూ. 2,500 విలువ చేసే స్మార్ట్ ఫోన్ ను రూ.251కే ఇస్తామని చెప్పిన రింగింగ్ బెల్స్ పై ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తాయి. కంపెనీపై కేసులు నమోదయ్యాయి. అయితే అప్పటికే ఆ సంస్థ ప్రకటనకు హోరెత్తిన మద్దతుతో 30 వేల మంది ఫ్రీడం 251 ఫోన్లను బుక్ చేశారు. మరో 7 కోట్ల మంది కూడా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. విమర్శల జడివాన నేపథ్యంలో 30 వేల మంది చెల్లించిన సొమ్మును వాపస్ చేసిన రింగింగ్ బెల్స్ కనుమరుగైందని అంతా అనుకున్నారు. అయితే నిన్న అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ రింగింగ్ బెల్స్ ఓ ప్రకటన చేసింది. ఈ నెల 28 నుంచి 30 వేల కస్టమర్లకు ఫ్రీడం 251 ఫోన్ల డెలివరీని మొదలుపెట్టనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ మోహిత్ గోయల్ చెప్పారు. విమర్శల నేపథ్యంలో ఇప్పటికే 30 వేల మంది చెల్లించిన సొమ్మును వాపస్ చేసిన తాము... ‘క్యాష్ ఆన్ డెలివరీ’ పధ్ధతిన ఫోన్లను అందించిన తర్వాతే వారి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News