: డొనాల్డ్ ట్రంప్ చేసిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలివిగో!
రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న డొనాల్డ్ ట్రంప్ కు ఎంతటి నోటి దురుసు ఉందో అందరికీ తెలిసిందే. ఎక్కడ మాట్లాడినా, ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఆయన నోటి నుంచి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య వచ్చే తీరుతుంది. ఆయన పార్టీ వారే నిర్ఘాంతపోయే వ్యాఖ్యలను ఎన్నింటినో ఆయన చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ నోటి నుంచి వచ్చిన అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలివి. * ఇవాంకా నా కుమార్తె కాకపోయి ఉంటే, నేను డేటింగ్ చేసి ఉండేవాడిని. * నా చేతి వేళ్లు చాలా అందంగా ఉంటాయి. శరీరంలోని ఇతర భాగాలూ అంతే బాగుంటాయి. * డైట్ కోక్ ను తాగుతున్న బక్క పలచటి వ్యక్తిని ఇంతవరకూ నేను చూడలేదు. * ఒబామా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం నకిలీది. ఈ విషయం అత్యంత నమ్మకమైన వర్గాల ద్వారా నాకు తెలిసింది. * అరియానా హఫింగ్టన్ (హఫింగ్టన్ పోస్ట్ ఎడిటర్ - ఇన్ - చీఫ్) అందంగా ఉండదు. బాహ్య, అంతఃసౌందర్యాల విషయంలో... ఆమె భర్త ఎందుకు వదిలేసి వెళ్లిపోయాడో నాకు తెలుసు. అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు. * నేను అధికారంలోకి వస్తే, దక్షిణాన మెక్సికోను వేరు చేస్తూ, అతిపెద్ద వాల్ ను నిర్మిస్తాను. దాని నిర్మాణ ఖర్చును మెక్సికో నుంచే లాగుతా. * మెక్సికో తన దేశస్తులను అమెరికాకు పంపుతోంది. వారు మంచి వారు కాదు. ఇక్కడ సమస్యలు సృష్టిస్తున్నారు. మాదక ద్రవ్యాలు తెస్తున్నారు. అదో పెద్ద నేరం. వారు రేపిస్టులు. * నేనే గనుక 'ది వ్యూ' (ఓ టెలివిజన్ షో) నిర్వహించే పక్షంలో యాంకర్ రోజీ ఓ డొనీల్ ను తక్షణం తీసేస్తా. అంత లావుగా, చూడటానికి అసహ్యంగా ఉండే ముఖంతో కనిపించే ఆమె ఎదురుగానే 'రోజీ నిన్ను తీసేస్తున్నా' అని చెప్పేస్తాను. * 'అప్రెంటీస్'లో పాల్గొన్న యువతులంతా తెలిసో, తెలియకో నాకు లైన్ వేయడానికి ప్రయత్నించారు. (అప్రెంటీస్ - ఓ అమెరికన్ రియాల్టీ షేమ్ షో. ఇందులో కంటెస్టెంట్ల వ్యాపార నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. గెలుపొందిన వారికి ట్రంప్ కంపెనీల్లో పనిచేసే అవకాశం లభిస్తుంది) * ఓ సెక్సీ గర్ల్ ఫ్రెండ్ పక్కనున్నంత సేపు ఏం జరిగినా ఫర్వాలేదు. * ప్రపంచంలోని ఏ ఒక్క ముస్లింను యూఎస్ లోకి ప్రవేశించకుండా నిషేధం విధిస్తాను. * నాకు ఎంతో మంది గే స్నేహితులు ఉన్నారు. నేను మాత్రం సంప్రదాయవాదినే. * అమె కళ్లు రక్తాన్ని వర్షిస్తున్నాయిప్పుడు. ఇంకో చోట నుంచి కూడా రక్తం కారుతుంది. (ఫాక్స్ న్యూస్ యాంకర్ మెగన్ కెల్లీ ఓ ఇంటర్వ్యూలో కఠినమైన ప్రశ్నలను అడుగుతున్న వేళ ట్రంప్ చేసిన వల్గర్ కామెంట్)