: బక్కెట్లు, బిందెలతో డీజిల్ కోసం పరుగులు పెడుతున్న గుంటూరు జిల్లా కామేపల్లి వాసులు
గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం కామేపల్లిలో నేటి ఉదయం జనమంతా రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఒట్టి చేతులతో కాదు సుమా... చేతుల్లో బిందెలు, బక్కెట్లు పట్టుకుని మరీ వారు పరుగులు తీశారు. ఎందుకో తెలుసా?... రోడ్డుపై వృథాగా పోతున్న డీజిల్ ను నింపుకునేందుకు! నెల్లూరు నుంచి డీజిల్ తో హైదరాబాదు బయలుదేరిన ఓ ఆయిల్ ట్యాంకర్ నేటి తెల్లవారుజామున అదుపు తప్పి కామేపల్లి శివారులో బోల్తా పడింది. దీంతో ట్యాంకర్ లోని డీజిల్ మొత్తం రోడ్డుపై ఒలిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కామేపల్లి వాసులు తమ ఇళ్లల్లోని బిందెలు, బక్కెట్లు పట్టుకుని ఆ డీజిల్ కోసం పరుగులు తీశారు.