: ఐఎస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బాగ్దాదీ హతం


ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కు దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. మొన్న (ఆదివారం) ఇరాక్- సిరియా సరిహద్దులో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు చేసిన వైమానిక దాడుల్లో ఐఎస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బాగ్దాదీ తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వినిపించాయి. అయితే ఈ దాడుల్లో అతడు చనిపోయాడని నేటి ఉదయం వార్తా కథనాలు వెల్లువలా వచ్చాయి. ఈ వార్తలను సంకీర్ణ సేనలు ధ్రువీకరించనప్పటికీ అమెరికా రక్షణ శాఖ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా టీవీ నెట్ వర్క్ ‘సీఎన్ఎన్’ బాగ్దాదీ చనిపోయినట్లు తెలిపింది. బాగ్దాదీ చనిపోయినట్లు తమకు విశ్వసనీయ వర్గాలు తెలిపాయని ఆ వర్గాలు చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది.

  • Loading...

More Telugu News