: స్వలింగ సంపర్కుల డేటింగ్ యాప్స్ చుట్టూ తిరిగే మతీన్... పల్స్ క్లబ్ రెగ్యులర్ కస్టమరే!


ఓర్లాండోలోని నైట్ క్లబ్ లో నరమేధం సృష్టించిన ఒమర్ మతీన్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నైట్ క్లబ్ ఉన్న ప్రాంతంలో మతీన్ ఎవరికీ తెలియని కొత్త వ్యక్తేం కాదు. పైగా ఈ క్లబ్ కు రెగ్యులర్ కస్టమర్ కూడా. మతీన్ తో తమకున్న పరిచయాలను పలువురు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. పల్స్ నైట్ క్లబ్ లోకి శనివారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో మతీన్ వెళుతున్నప్పుడు, అక్కడి పార్కింగ్ ప్లేస్ లో ఉన్న కెవిన్ వెస్ట్ అనే వ్యక్తి చూశాడు. మతీన్ ను విష్ చేశాడు కూడా. "డేటింగ్ యాప్ ద్వారా ఓ సంవత్సరం క్రితం నాకు పరిచయం అయ్యాడు మతీన్. ఆపై కొంతకాలం మాయమైనా, తిరిగి మూడు నెలల క్రితం సంప్రదించాడు. ఓర్లాండోకు వస్తున్నానని, కలసి పార్టీ చేసుకుందామని చెప్పాడు. పల్స్ క్లబ్ లో నేను ఎన్నోసార్లు అతన్ని చూశాను" అని చెప్పాడు. మతీన్ తో పరిచయమున్న మరో వ్యక్తి కోర్డ్ సెడెనో మాట్లాడుతూ, "క్లబ్ లో గతంలోనూ మతీన్ ను చూశాను. బార్ దగ్గర నిలబడి మద్యం సేవిస్తుండేవాడు. సెల్ఫీలు అధికంగా తీసుకుంటూ ఉండే అతన్ని సులువుగానే గుర్తు పట్టవచ్చు. కొంతకాలం క్రితం మాకు ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది" అని చెప్పుకొచ్చాడు. దేశంలో వలసవాదిగా తాను చదువుకుంటున్న రోజుల నుంచే మతీన్ వేధింపులకు గురయ్యాడని, అతని జీవితంలో ఓ చీకటి కోణం ఉండి ఉండవచ్చని మతీన్ పరిచయస్తులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News