: పారిస్‌లో మరోసారి రెచ్చిపోయిన ముష్కరులు.. మాగ్నావిల్‌లో కాల్పులు
పారిస్ ప్రజలను ఉగ్రభయం వీడడం లేదు. అక్కడి మాగ్నావిల్‌లో తాజాగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరోసారి దాడులకు పాల్పడ్డారు. దాడులతో ఆ ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సాయుధుడైన ఉగ్రవాది కాల్పులతో విరుచుకుపడ్డాడు. కాల్పుల్లో అక్కడి ఓ పోలీస్ అధికారి, ఆయన భార్య మృతి చెందారు. ఉగ్రవాది కాల్పులపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకొని ఉగ్రవాదిని హతమార్చారు. మాగ్నావిల్ ప్రాంతంలో దాడికి దిగింది తామేనని అనంతరం ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది. పారిస్‌లో భద్రతను పెంచారు. అక్కడి ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నాయి.