: హైదరాబాద్ లో పోలియో వైరస్... అధికారుల్లో తీవ్ర కలకలం!
ఇండియా నుంచి పోలియో వైరస్ ను శాశ్వతంగా తరిమేశామన్న వైద్యాధికారులకు తీవ్ర షాక్ ను ఇస్తూ, హైదరాబాద్ లో పోలియో వైరస్ కనిపించింది. ఇక్కడి మురికినీళ్లలో వైరస్ బయటపడటంతో, ఉలిక్కిపడిన వైద్య ఆరోగ్య శాఖ, మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వైరస్ ఎలా తిరిగి వచ్చిందో తెలియడం లేదని అధికారులు అంటున్నారు. ఎవరైనా విదేశీయుల నుంచి వచ్చి వుండవచ్చని సీనియర్ వైద్యాధికారులు భావిస్తుండగా, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ పలువురు అధికారులతో చర్చించి పరిస్థితిని సమీక్షించారు. హైదరాబాద్ లో అత్యంత ప్రమాదకరమైన పోలియో వైరస్ కనిపించడంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. మరిన్ని పరిశోధనలు చేసి ఈ మహమ్మారి ఎలా వచ్చిందన్న విషయాన్ని తేల్చాలని ఆదేశించింది.