: మైక్రోసాఫ్ట్ చేతికి లింక్ డ్ ఇన్!... రూ.1.75 లక్షల కోట్లకు కొన్న టెక్నాలజీ దిగ్గజం!


ప్రపంచంలోని పలు రంగాలకు చెందిన నిపుణుల మధ్య అనుసంధాన కర్తగా సత్తా చాటుతున్న ‘లింక్ డ్ ఇన్’ ఇకపై టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తో కలిసి తన తదుపరి ప్రయాణం సాగించనుంది. ఈ మేరకు లింక్ డ్ ఇన్ ను తాము కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల నిన్న అమెరికాలోని న్యూయార్క్ లో సంచలన ప్రకటన చేశారు. ఇందుకోసం రూ.2,620 కోట్ల డాలర్లు (రూ.1.75 లక్షల కోట్లు) వెచ్చిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ డీల్ మైక్రోసాఫ్ట్ టేకోవర్ల జాబితాలోనే అతి పెద్దదిగా రికార్డులకెక్కనుంది. ఇరు కంపెనీల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ప్రస్తుతం లింక్ డ్ ఇన్ సీఈఓగా కొనసాగుతున్న జెఫ్ వీనర్ ఇకపైనా అదే పదవిలో కొనసాగుతారు. మైక్రోసాఫ్ట్ అనుబంధ విభాగం ‘మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 360’తో కలిసి లింక్ డ్ ఇన్ పనిచేయనుంది. ఈ డీల్ ను ప్రకటిస్తున్న సందర్భంగా సత్య నాదెళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి నుంచి లింక్ డ్ ఇన్ కు పెద్ద అభిమానిని అని పేర్కొన్నారు. లింక్ డ్ ఇన్ తో కలిసి కొత్త అవకాశాలను సృష్టిస్తామని కూడా సత్య ప్రకటించారు.

  • Loading...

More Telugu News