: ఏరువాకలో ‘పల్లె’ కొత్త రూపం... పంచె కట్టి, తలకు పాగా చుట్టి విత్తనమేసిన ఏపీ మంత్రి


తెలుగు రాష్ట్రాల మంత్రులు ప్రజలతో మమేకమవుతున్నారు. ప్రత్యేకించి ఏపీ కేబినెట్ మంత్రులు, టీడీపీ నేతలు... వారిలోనూ అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డిలు తమదైన శైలిలో నిత్యం జనం మధ్యే ఉంటున్నారు. తమ శాఖలకు చెందిన ముఖ్యమైన కార్యక్రమాలు మినహా మిగిలిన సమయమంతా వారు జనంతోనే ఉంటున్నారు. ఈ క్రమంలో జనంతో మమేకమవుతున్న వారిద్దరూ అన్నదాతల కుటుంబం నుంచి వచ్చిన తమ నేపథ్యాన్ని చాటుకుంటున్నారు. ఏపీ సర్కారు చేపట్టిన ఏరువాక కార్యక్రమంలో భాగంగా నిన్న అనంతపురం జిల్లా గార్లదిన్నెలో మంత్రి పల్లె రఘునాథరెడ్డ కొత్త రూపంలో కనిపించారు. వర్షాలు బాగా కురుస్తున్న నేపథ్యంలో ఆ జిల్లాలో రైతులు సాగుకు సన్నద్ధమయ్యారు. వెరసి జిల్లాలో పెద్ద ఎత్తున సాగు కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో నిన్న గార్లదిన్నెలో పర్యటించిన మంత్రి పల్లె... పంచె కట్టులో కనిపించారు. రాయలసీమ స్టైల్లో.. తెల్లటి పంచె కట్టి, దానిని మోకాళ్ల దాకా పైకెత్తి కట్టి, తలకు రుమాలు చుట్టి, చొక్కా విప్పేసి కేవలం బనియన్ మీదే పొలంలోకి దిగిన ఆయన అక్కడ అప్పటికే సిద్ధమైన గొర్రు పట్టి విత్తనమేశారు. స్వయంగా మంత్రి గొర్రు పట్టడంతో అక్కడి రైతులు ఉత్సాహంగా ఏరువాకలో పాలుపంచుకున్నారు.

  • Loading...

More Telugu News