: టీవీ సీరియల్స్ గతంలోలా ఇప్పుడు 'సాగడం' లేదు!: రష్మీ దేశాయ్


ప్రజల్లో పేరు తెచ్చుకున్న నటులు ఎప్పుడూ చిరునవ్వుతో వుండాలని, అయితే అలా ఉండగలగడం అనుకున్నంత సులభం కాదని హిందీ బుల్లితెర నటి రష్మీ దేశాయ్ పేర్కొంది. ముంబైలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రష్మీ మాట్లాడుతూ, సెలెబ్రిటీ హోదా అన్నది అంత సులభంగా రాదని చెప్పింది. ప్రజలు ప్రతి నిత్యం గమనిస్తుంటారని, ఆఖరుకి ఏ డ్రెస్ వేసుకున్నాం? ఎలా వ్యవహరించాం?.. ఇలా ప్రతి విషయాన్ని డేగకళ్లతో చూస్తారని పేర్కొంది. తానెవరో తెలియని దశ నుంచి అభిమానులు గుర్తించే స్థాయికి చేరుకున్నానని తెలిపిన రష్మీ, అభిమానులు చుట్టుముట్టినప్పుడు సంయమనంతో వ్యవహరిస్తానని చెప్పింది. ఒకప్పుడు బుల్లితెరపై సీరియల్ అంటే ఏళ్ల తరబడి సాగేవని చెప్పింది. ఇప్పుడు అలా కాదని, సరికొత్త కథలు, కథనాలతో కొన్ని నెలల్లోనే పూర్తవుతున్నాయని ఆమె తెలిపింది. పాత్ర బాగుంటే ఎవరికైనా పేరు వస్తుందని లేని పక్షంలో అనామకులుగా మిగిలిపోతామని రష్మీ చెప్పింది.

  • Loading...

More Telugu News