: ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త తలనొప్పి... పార్లమెంటరీ సెక్రటరీల బిల్లును తిరస్కరించిన రాష్ట్రపతి!
ఆమ్ ఆద్మీ పార్టీకి కొత్త తలనొప్పి చుట్టుకుంది. వివరాల్లోకి వెళ్తే... ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించిన ఢిల్లీ ప్రభుత్వం, అందుకు సంబంధించి పంపిన సవరణ బిల్లును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించలేదు. వీరి నియామకం రాజ్యాంగ విరుద్ధమంటూ పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం పంపిన బిల్లును రాష్ట్రపతి తిరిగి పంపించివేశారు. దీంతో ఈ 21 మంది ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అనర్హులుగా మారే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే అసెంబ్లీ రద్దవుతుందని, తద్వారా ఎన్నికలకు వెళ్లక తప్పదని నిపుణులు చెబుతున్నారు.